Posts

Showing posts with the label Bhadrachalam Talambralu

భద్రాచల తలంబ్రాలకు కోటగల్లిలో ఘన స్వాగతం.. కోలాటాలతో భక్తుల ర్యాలీ

Image
భద్రాచల రామయ్య కల్యాణ తలంబ్రాలు గురువారం నాడు నిజామాబాద్ జిల్లా కోటగల్లికి చేరుకున్నాయి. ఈ సందర్బంగా కన్నుల పండుగగా మహిళలు కోలాటలతో శోభాయాత్ర కోటగల్లి లోని మల్లికార్జున దేవాలయం నుండి జైర్కోట్ హనుమాన్ దేవాలయానికి భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులచే భజన చేయించి అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అనంతరం మాట్లాడుతూ భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి 300కిలోల గోటి తలంబ్రాలు ఓలిపించి అందించామన్నారు. అందులో కోటగల్లి నుండి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు అందించారని తెలిపారు. భద్రాచలం నుండి 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చానన్నారు. తలంబ్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని రామకోటి రామరాజు కృషి, పట్టుదల గొప్పదని కొనియాడి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున భజన మండలి, విజయ గణపతి భజన మండలి, జేర్కోట్ భజన మండలి, మైసమ్మగుడి భజన మండలి, మార్కండేయగుడి భజన మండలి, పరమేశ్వర భజన మండలి, అభయాంజనేయ భజన మండలిలు పాల్గొన్నాయి. మీ Whatsapp లోకి మన నిజామాబ...