Posts

Showing posts with the label Devotees of Sri Rama

నిజామాబాద్ నుండి కదిలిన గోటి తలంబ్రాలు

Image
రామకోటి రామరాజుకు తలంబ్రాలు అందజేసిన భక్తులు భద్రాచల రామయ్య కళ్యానానికి నిజామాబాద్ జిల్లా కోటగల్లి హనుమాన్ దేవాలయం నుండి కదిలిన గోటి తలంబ్రాలు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సంవత్సరం 300కిలోల గోటి తలంబ్రాలు అందించాలన్న సంకల్ప దీక్షతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామనామ స్మరణ చేయించి గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నాడు నిజామాబాద్ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భక్తితో ప్రతి భక్తుడు కూడా మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా మేము ఓలిచిన తలంబ్రాలు రామయ్య కళ్యాణనికి చేరడం ఎన్నో జన్మల పుణ్యమో అన్నారు. Follow Our WhatsApp Channel