Posts

Showing posts with the label Hanuman rally

వీర హనుమాన్ విజయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Image
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర రూట్ మ్యాప్ ను మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. స్థానిక కోడూరు హనుమాన్ ఆలయం నుండి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులతో కలిసి పెద్ద బజార్,నిజాంసాగర్ చౌరస్తా, జీవధాన్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, కొత్త బస్టాండ్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ధర్మశాల, సుభాష్ రోడ్డు, పాంచ్రస్తా హరిజనవాడ, రూట్ లో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్పీ, సిఐ, విద్యుత్తు, మున్సిపల్, ఆర్ అండ్ బి తదితర అధికారులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుపబడే వీర హనుమాన్ విజయాత్ర ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఎఎస్పీ చైతన్య రెడ్డి లకు అందచేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆధార నిత్యానందం,కార్యదర్శి బొల్లి రాజు, ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్ రావు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, ఏకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ...

హనుమాన్ ర్యాలీకి లక్షకు పైగా భక్తులు.. VHP భారీ ఏర్పాట్లు

Image
📍 నిజామాబాద్, ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ ధరణి ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఈసారి లక్షకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. 👉 ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం కూడా లక్షకు పైగా భక్తులు పాల్గొన్నారని, ఈసారి మరింత భారీగా స్పందన ఉండే అవకాశం ఉందన్నారు. 💬 ఈ ర్యాలీ విజయవంతం కావడానికి ప్రజలతో పాటు పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 👉 నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ హిందూ విభాగం కార్యదర్శి కృష్ణాజీ దినేష్ ఠాగూర్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు దాసరి సాయి ప్రసాద్, దాత్రిక రమేష్, శేఖర్, నికేష్ తదితరులు పాల్గొన్నారు. 👉 మీరు ఈ ర్యాలీలో పాల్గొంటారా? కామెంట్ చేయండి 💬 👉 మరిన్ని తాజా వార్తల కోసం Mana Nizamabad ను ఫాలో అవ్వండి 🔔 Follo...