Posts

Showing posts with the label Hyderabad Petrol Pumps

3 నెలలకు సరిపడా పెట్రోల్,డీజిల్ ఉంది. -మంత్రి ఉత్తమ్

Image
-మంత్రి ఉత్తమ్ హైదరాబాద్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజాలేవరు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఆయన మీడియాతో ముచ్చటించారు. రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని జరుగుతున్న వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అంటే ...