Posts

Showing posts with the label Karnataka Dasara

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. జంబూ సవారిలో చాముండేశ్వరి అమ్మవారి దర్శనం

Image
కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ✅ కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. కర్నాటక నాడ హబ్బ (రాష్ట్ర పండుగ) ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel