Posts

Showing posts with the label Private Jobs

నిజామాబాద్ జాబ్ మేళాలో 2 వేల మందికి ప్రైవేటు ఉద్యోగాలు

Image
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్, కామారెడ్డి లతో కూడిన ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళాకు తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయని నిర్వాహకులు ప్రకటించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తదితరులు విచ్చేసి, జాబ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. సుమారు రెండు వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరికొందరికి అప్రెంటిస్ షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేశారని అన్నారు. ఈ తరహా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే...