Posts

Showing posts with the label Sai Chaitanya

64 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 80 కిలోల కాపర్ కాయిల్స్ స్వాధీనం

Image
జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని రాగి (కాపర్) కాయిల్స్ ను అపహరిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల మురాను రెంజల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. లక్షల విలువైన 80 కిలోల కాపర్ కాయిల్స్, దొంగతనాలకు ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నలుగురు స్క్రాప్ (పాత ఇనుప సామాను) వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గురువారం (మే 21) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెంజల్ సట్- ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి. ప...

భగత్ సింగ్ గొప్ప యోధుడు -పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

Image
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి నిత్యం స్మరించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలను సైతం నవ్వుతూ వదులుకున్న ఎందరో మహనీయుల త్యాగాలను భారతీయులందరూ ప్రతినిత్యము స్మరించుకోవాలని అన్నారు ఆయన. మార్చ్ 23న నవ యువకులైన దేశభక్తులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ ల ప్రాణత్యాగానికి గుర్తుగా సమర్పణ దివస్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కులాలు, మతాలు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండటమే మన స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత ఆశయమని గుర్తు చేశారు, ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం ఇంకేది ఉండదని ,అలాంటిది వేలాదిమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం వదిలిపెట్టారని ఆయన తెలిపారు. నవ యువకులుగా ఉన్న అతిపిన్న వయసు గల యువకులు భగత్ సింగ్ అతని స్నేహితులు రాజ్ గురు, సుఖదేవ్ లు ఉరి కొయ్యలను సైతం నవ్వుతూ ముద్దాడి మెడలో వేసుకున...