Posts

Showing posts with the label Telangana Inter Results

నిజామాబాద్‌లో ఇంటర్ ఫలితాలు 2025-26: 66.19% ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి

Image
2025-26 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో జనరల్ విభాగంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 66.19% ఉత్తీర్ణత సాధించారు. కాగా మొదటి సంవత్సరం విద్యార్థులు 56.64% ఉత్తీర్తో సాధించారు. అలాగే జిల్లాలో ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరంలో 67.68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం లో 49.65% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చ్ నెలలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలలో మొత్తం రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,606 మంది పరీక్షలకు హాజరుకాగా 5,823 మంది బాలికలు ఉత్తీర్ణత కాగా 76.56% శాతం తో బాలుర పై చేయి సాధించారు. రెండవ సంవత్సరం బాలురు 6 ,273 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,364 మంది విద్యార్థులు పాసై 53.63% సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం విద్యార్థులు 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8,806 మంది విద్యార్థులు పాస్ కాగా 56.64% సాధించారు. వీరిలో బాలికలు 8,711 మంది ...