Posts

Showing posts with the label Telangana assembly

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం: అసెంబ్లీలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

Image
ఇందూరు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాదిరిగానే పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఇటీవల పోలీసులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశారని, ఇటీవల హైదరాబాదులోనూ దాడులు జరిగాయని గుర్తు చేశారు. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం సంతోషదాయకనన్నారు. గతంలో పెద్దపల్లి లో జంట న్యాయవాదుల హత్య అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే ఇటీవల మహిళా అడ్వకేట్ ను హత్య చేయడం, ఇందూరులో కొందరు గుండాలు అడ్వకేట్ సొంత ఇంటిపై దాడి చేయడం ..ఇలా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బిల్లు తీసుకురావడం సంతోషక మని స్పష్టం చేశారు. Follow Our WhatsApp Channel