డీఎస్ సమాధి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టాలి – సంజయ్‌కు పదవి ఇవ్వాలని డిమాండ్
మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు తగ్గ పదవి ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ లో ఆయన అభిమానులు శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్‌కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఒక విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో సంజయ్ పాత్ర కూడా ఉందంటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు డిఎస్ మరణం తర్వాత ఆయన సమాధి వద్ద ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోవాలన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో సంజయ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర...