Posts

Showing posts with the label online fraud

నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం బట్టబయలు – ₹152 కోట్ల లావాదేవీలు, 9 మంది అరెస్ట్ - శభాష్ CP సాయి చైతన్య

Image
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచనల మేరకు ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌ను IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ , సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి 7 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా, కర్ణాటక బ్యాంక్‌లో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించి అక్రమంగా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు వెలికితీశారు. ఈ నిందితులు ఫేక్ డాక్యుమెంట్స్‌తో బిజినెస్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే విధంగా అందించినట్లు గుర్తించబడింది. ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ. 152 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. మరికొంతమంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారిని త్వరలో గుర...