పసుపు పంట వర్షార్పణం.. -రైతుకు తీరని నష్టం
నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు మొత్తంగా 16,900 క్వింటాళ్ల పసుపు వచ్చింది. మార్కెట్కు వచ్చిన పసుపు కొమ్ములను దాదాపు 70 నుంచి 80శాతం వరకు షెడ్లలో ఉంచుతున్నారు. అయితే ఎక్కువగా పసుపు యార్డ్కు రావడంతో మార్కెట్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ కొమ్ములను ఉంచారు. కాని సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి యార్డులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు పూర్తిగా తడిసిపోయింది. నీళ్లలో మునిగిపోయింది. వర్షాలను ముందుగానే పసిగట్టి ముందుగానే రైతులు టార్పాలిన్లతో పసుపును కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాలి దుమారంతో కూడిన వర్షం పడడంతో పసుపు పూర్తిగా తడిసిపోయింది.మార్కెట్కు ఎక్కువ మొత్తంలో పసుపు రావడంతో నష్టం ఏర్పడింది. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel