Posts

Showing posts with the label BRS Congress BJP

KTR, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BJP MLA పాయల్ శంకర్ భేటీ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.

Image
అసెంబ్లీ వేదికగా ఇద్దరు బడా నేతలు లంచ్ టైమ్ టేబుల్ మీటింగ్లో భేటీ కావడం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.. ఉత్తర,దక్షిణ దృవాలుగా ఉన్న BRS, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు పెద్ద నాయకుల భేటీలో జాతీయ పార్టీ MLA కూడా ఉండడం పెను సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాన్నం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, కాంగ్రెస్ రెబల్ స్టార్, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య అసెంబ్లీ లాంజిలో విందు సమావేశం జరిగింది. వీరితో పాటు BJP MLA పాయల్ శంకర్ కూడా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ముచ్చటగా మూడు ప్రధాన పార్టీల ప్రజా ప్రతినిధుల నడుమ జరిగిన భేటీ పావు గంటనో.. అర్ధ గంటనో అయితే మామూలు భేటీ అనుకోవచ్చు.. ఏకంగా రెండు గంటల పాటు ముగ్గురు నేతల మధ్య రాజకీయ చర్చ జరిగింది. సాయంత్రం వరకు ఈ ముగ్గురు నేతల భేటీ రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. దీనితో అసలేమి జరిగిందనే అంశంపై నిఘా వర్గాలు రంగంలో దిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఢిల్లీ వెళ్లడం..ఇదే అదనుగా KTR, రాజగోపాల్ రెడ్డి,పాయల్ శంకర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది.. మంత్రి పదవి ఇస్తామని రాహుల్ గాంధీ ముందే హామీ లభించడంతో ర...