KTR, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BJP MLA పాయల్ శంకర్ భేటీ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.

అసెంబ్లీ వేదికగా ఇద్దరు బడా నేతలు లంచ్ టైమ్ టేబుల్ మీటింగ్లో భేటీ కావడం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.. ఉత్తర,దక్షిణ దృవాలుగా ఉన్న BRS, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు పెద్ద నాయకుల భేటీలో జాతీయ పార్టీ MLA కూడా ఉండడం పెను సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాన్నం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, కాంగ్రెస్ రెబల్ స్టార్, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య అసెంబ్లీ లాంజిలో విందు సమావేశం జరిగింది. వీరితో పాటు BJP MLA పాయల్ శంకర్ కూడా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ముచ్చటగా మూడు ప్రధాన పార్టీల ప్రజా ప్రతినిధుల నడుమ జరిగిన భేటీ పావు గంటనో.. అర్ధ గంటనో అయితే మామూలు భేటీ అనుకోవచ్చు.. ఏకంగా రెండు గంటల పాటు ముగ్గురు నేతల మధ్య రాజకీయ చర్చ జరిగింది. సాయంత్రం వరకు ఈ ముగ్గురు నేతల భేటీ రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. దీనితో అసలేమి జరిగిందనే అంశంపై నిఘా వర్గాలు రంగంలో దిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఢిల్లీ వెళ్లడం..ఇదే అదనుగా KTR, రాజగోపాల్ రెడ్డి,పాయల్ శంకర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది.. మంత్రి పదవి ఇస్తామని రాహుల్ గాంధీ ముందే హామీ లభించడంతో రాజగోపాల్ రెడ్డి BJP కి టాటా చెప్పి కాంగ్రెస్ లో చేరారు. అయినా మంత్రి పదవి కోసం ఆయన రెండేళ్ల నిరీక్షణ ఫలించడం లేదు.ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రి అవుతానని పబ్లిక్ మీటింగ్ లోనే ధమ్కీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి.. రాజకీయ,సామాజిక సమికరణాలను సాకుగా చూపుతూ మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.దీనితో ఆయన ప్రస్టేషన్ ఆకాశానికి పెరిగింది. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి ఒక విందులో హరీష్ రావు తో భేటీ కాగా..ఇపుడు ఓపెన్ గా అసెంబ్లీ వేదికగా KTR తో మంతనాలు జరపడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయ వచ్చని ప్రచారం జరుగుతోంది..

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్