Posts

Showing posts with the label Collector Ila Tripathi

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం.. ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా యంత్రాంగం

Image
*సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం ............ నిజామాబాద్, మే 22 : వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరుల చేతుల మీదుగా సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యల గురించి విశేషంగా కృషి చేసిన దృష్ట్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను సత్కరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి...

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

Image
పెర్కిట్, మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహి...