పెర్కిట్ మహిళా ప్రాంగణం ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

పెర్కిట్, మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన యువతులను వేధించిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్