CSI గ్రౌండ్లో చర్చకు రా.. MLA వెంకట రమణ రెడ్డికి - కాంగ్రెస్ సవాల్
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీరుపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. 'వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం!'అంటూ మండి పడింది. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు; 1)రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా: తన విద్యాసంస్థ పక్కన ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టింది నువ్వు కదా?కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా 30 వేల గజాల భూమిని బెదిరించి 3 వేల గజాలకు తగ్గించలేదా? 2 )కర్షక్ విద్యాసంస్థల కుంభకోణం: రైతుల బిడ్డల కోసం సేకరించిన 260 ఎకరాల భూమిని అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి దారదత్తం చేసి, ఆ భూములను బ్యాంకులో కుదవపెట్టి రూ. 7 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? 3)ఫోర్జరీ సంతకాలపై కోర్టు కేసులు ఉన్నవా లేవా? 4)"మూడు నెలల క్రితం జపాన్ పర్యటన వెనుక అసలు కథ ఏంటి? అక్కడ ఏం చేశావో సెకండ్ ఎపిసోడ్‌లో నీ బండారం బయటపెడతాం" అని హెచ్చరించారు. 5) రోడ్డు నిర్మాణం వెనుక కమీషన్లు: టేక్రియల్ నుండి లింగాపూర్ 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకున్న వ్యక్తివి, ఇప్పుడు ముందుండి ఎందుకు వేయిస్తున్నావు? అందులో నీకు ఎంత ముట్టింది? 6)వరుస మోసాలు - బెదిరింపులు ఎమ్మెల్...