Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

CSI గ్రౌండ్లో చర్చకు రా.. MLA వెంకట రమణ రెడ్డికి - కాంగ్రెస్ సవాల్

 


కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీరుపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. 'వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం!'అంటూ మండి పడింది.

కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు;

1)​రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా: తన విద్యాసంస్థ పక్కన ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టింది నువ్వు కదా?కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా 30 వేల గజాల భూమిని బెదిరించి 3 వేల గజాలకు తగ్గించలేదా?

2 )​కర్షక్ విద్యాసంస్థల కుంభకోణం: రైతుల బిడ్డల కోసం సేకరించిన 260 ఎకరాల భూమిని అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి దారదత్తం చేసి, ఆ భూములను బ్యాంకులో కుదవపెట్టి రూ. 7 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా?

3)ఫోర్జరీ సంతకాలపై కోర్టు కేసులు ఉన్నవా లేవా?

4)"మూడు నెలల క్రితం జపాన్ పర్యటన వెనుక అసలు కథ ఏంటి? అక్కడ ఏం చేశావో సెకండ్ ఎపిసోడ్‌లో నీ బండారం బయటపెడతాం" అని హెచ్చరించారు.

5) ​రోడ్డు నిర్మాణం వెనుక కమీషన్లు: టేక్రియల్ నుండి లింగాపూర్ 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకున్న వ్యక్తివి, ఇప్పుడు ముందుండి ఎందుకు వేయిస్తున్నావు? అందులో నీకు ఎంత ముట్టింది?

6)​వరుస మోసాలు - బెదిరింపులు

​ఎమ్మెల్యే తన సొంత మిత్రులను, వ్యాపార భాగస్వాములను కూడా వదలలేదు కదా?

7)​టీవీ కేబుల్ నెట్వర్క్ పేరుతో పార్టీ నాయకులను నట్టేట ముంచావు.

​అశోక్ నగర్ కాలనీకి చెందిన ఒక అమాయకుడి ఇంటి కాగితాలు బ్యాంకులో పెట్టి రూ. 20 లక్షల అప్పు చేసి, తీర్చలేదు కదా?

8) ​అంతంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 146లో 1 ఎకరం 12 గుంటల భూమిని 'రైస్ పుల్లింగ్' పేరుతో నరసింహారెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి కబ్జా చేసింది నిజమ్ కాదా?



Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన