Posts

Showing posts with the label Common People Struggles

ప్రజావాణి పేదలకు భారమా?.. కలెక్టరేట్ చేరాలంటే ₹100 ఖర్చు తప్పదా!

Image
ప్రజావాణి.. పేదవాడికి వెతలేనా? ₹100 ఖర్చు చేస్తే తప్ప కలెక్టరేట్ గడప తొక్కలేని దుస్థితి! "మన నిజామాబాద్" ప్రత్యేక కథనం: జిల్లా నలుమూలల నుంచి ఆశతో వస్తున్న అర్జీదారులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, ఎక్కడో అప్పు తెచ్చిన వంద రూపాయలు ఆటోలకే పోస్తుంటే.. తీరని సమస్యల వేదన సామాన్యుడిని కుంగదీస్తోంది. నిరాశ పరుస్తున్న 'పేపర్' రాజకీయం: కలెక్టర్ గారిని కలిసి తమ గోడు చెప్పుకుందామని వస్తే, కేవలం ఒక కాగితం కింది స్థాయి అధికారికి ఇచ్చి వెనుతిరగాల్సి రావడం ఒక 'నగ్న సత్యం'. కొత్తగా వచ్చిన మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల నిరాశే ఎదురవుతోంది. అధికారుల అలసత్వం - మీకో పాపం: కింద స్థాయి సిబ్బంది చేసే నిర్లక్ష్యం అంతిమంగా జిల్లా యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తోంది. దయచేసి ప్రజావాణి అర్జీలను కేవలం కాగితాలుగా చూడకుండా, వారం వారం వాటిపై సమీక్ష నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం. మా డిమాండ్ - ఉచిత ప్రయాణం: బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రావడానికి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి,...