ప్రజావాణి పేదలకు భారమా?.. కలెక్టరేట్ చేరాలంటే ₹100 ఖర్చు తప్పదా!

ప్రజావాణి.. పేదవాడికి వెతలేనా? ₹100 ఖర్చు చేస్తే తప్ప కలెక్టరేట్ గడప తొక్కలేని దుస్థితి!
"మన నిజామాబాద్" ప్రత్యేక కథనం:
జిల్లా నలుమూలల నుంచి ఆశతో వస్తున్న అర్జీదారులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, ఎక్కడో అప్పు తెచ్చిన వంద రూపాయలు ఆటోలకే పోస్తుంటే.. తీరని సమస్యల వేదన సామాన్యుడిని కుంగదీస్తోంది.
నిరాశ పరుస్తున్న 'పేపర్' రాజకీయం: కలెక్టర్ గారిని కలిసి తమ గోడు చెప్పుకుందామని వస్తే, కేవలం ఒక కాగితం కింది స్థాయి అధికారికి ఇచ్చి వెనుతిరగాల్సి రావడం ఒక 'నగ్న సత్యం'. కొత్తగా వచ్చిన మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల నిరాశే ఎదురవుతోంది.
అధికారుల అలసత్వం - మీకో పాపం: కింద స్థాయి సిబ్బంది చేసే నిర్లక్ష్యం అంతిమంగా జిల్లా యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తోంది. దయచేసి ప్రజావాణి అర్జీలను కేవలం కాగితాలుగా చూడకుండా, వారం వారం వాటిపై సమీక్ష నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం.
మా డిమాండ్ - ఉచిత ప్రయాణం: బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రావడానికి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి, ఆర్టీసీ మంత్రిత్వ శాఖతో మాట్లాడి ప్రతి సోమవారం కనీసం 6 ఉచిత షటిల్ ట్రిప్పులు నడపాలి. "ప్రజల కన్నీళ్లు తుడవడమే పాలన అసలు ఉద్దేశ్యం కావాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ దిశగా అడుగులు వేస్తారని 'మన నిజామాబాద్' ఆశిస్తోంది."

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్