Posts

Showing posts with the label Congress Party Office

50 కోట్ల భూమి.. 5 లక్షలకే.. -కాంగ్రెస్ కాయ్ రాజా కాయ్

Image
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికెలో చెర లోకి రావడమనేది కొత్త నానుడి. రాజకీయ పోకడతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్ కు సొంతం అయ్యింది..1965 లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయ్యింది ఇప్పుడు..1980 లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు...దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి.. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే.. ఇట్లా నగరం నడి బొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. ఇదే ఆఫీసు ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం లక్షన్నర విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది..4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. PCC చీఫ్ మహేష్ కుమార్ గ...