50 కోట్ల భూమి.. 5 లక్షలకే.. -కాంగ్రెస్ కాయ్ రాజా కాయ్
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికెలో చెర లోకి రావడమనేది కొత్త నానుడి.
రాజకీయ పోకడతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్ కు సొంతం అయ్యింది..1965 లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయ్యింది ఇప్పుడు..1980 లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు...దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి.. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే..
ఇట్లా నగరం నడి బొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. ఇదే ఆఫీసు ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం లక్షన్నర విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది..4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,షబ్బీర్ అలీ జట్టు కట్టి ఆఘమేఘాల మీద ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టించారు.. ఆల్ రెడీ సొంత స్థలంలో పక్కా భవనం ఉన్నప్పటికీ.. దీనికి ఎదురుగానే ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది అధికార పార్టీ...
BRS ఏం తక్కువ కాదు;
BRS పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎల్లమ్మ గుట్టలో ఇరిగేషన్ శాఖ కు చెందిన 3000 గజాలకు టెండర్ పెట్టింది..30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఐదు లక్షల లోపే నామినల్ రేటు చెల్లించి పార్టీ ఆఫీసుకు సొంతం చేసుకుంది. ఇప్పుడా స్థలంలో అధునాతన కార్యాలయ సముదాయం ఉంది..
ఇట్లా పాలక పక్ష పార్టీలు ఆఫీసుల కోసమని కోట్లాది రూపాయల విలువ గల భూములను అగ్గువ ధరకే కొనుగోలు చేస్తున్నాయి.
పేదల సొంతింటి కల సాకారం కోసం చెప్పులు అరిగేలా తిరిగినా స్థలాలు లేవని బుకాయించడం రివాజుగా మారింది. ఈ విషయంలో కాంగ్రెస్,BRS లకు మినహాయింపు లేదు..ఇల్లు కట్టుకుంటాము ప్రభు 100 గజాల జాగా ఇమ్మని సాగిల పడినా కనికరించని ప్రభువులు వాళ్ళ పార్టీ ఆఫీసుల నిర్మాణం పేరిట కోట్లాది రూపాయల గల భూములకు ఎసరు పెడుతున్నారు.. అధికారం అండగా ఉండగా అడిగేదెవడనే తెంపరి తనం ప్రదర్శిస్తున్నాయి పాలక పక్ష కాంగ్రెస్,BRS పార్టీలు..
(జమాల్పూర్ గణేష్ - మూల్పూరు రాజేంద్ర బాబు)
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel