నిజామాబాద్‌లో ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: అధికారి శ్రీకాంత్ రెడ్డి
📍 నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. 👉 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐఓసీఎల్ ఆధీనంలో 62 బంకుల్లో రోజుకు సుమారు 3.94 లక్షల లీటర్ల పెట్రోల్, 4.59 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. 👉 హెచ్‌పీసీఎల్ పరిధిలో 64 బంకుల్లో 3.54 లక్షల లీటర్ల పెట్రోల్, 3.83 లక్షల లీటర్ల డీజిల్, 👉 భారత్ పెట్రోలియం పరిధిలో 69 బంకుల్లో 3 లక్షల లీటర్ల పెట్రోల్, 3.5 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 2.60 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. 💬 కృత్రిమంగా కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 👉 ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా లేదని, బుకింగ్ ప్రక్రియ సాధారణంగానే కొనసాగుతోందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లన...