నిజామాబాద్‌లో ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: అధికారి శ్రీకాంత్ రెడ్డి
📍 నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
👉 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐఓసీఎల్ ఆధీనంలో 62 బంకుల్లో రోజుకు సుమారు 3.94 లక్షల లీటర్ల పెట్రోల్, 4.59 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు.
👉 హెచ్‌పీసీఎల్ పరిధిలో 64 బంకుల్లో 3.54 లక్షల లీటర్ల పెట్రోల్, 3.83 లక్షల లీటర్ల డీజిల్,
👉 భారత్ పెట్రోలియం పరిధిలో 69 బంకుల్లో 3 లక్షల లీటర్ల పెట్రోల్, 3.5 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 2.60 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు.
💬 కృత్రిమంగా కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉 ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా లేదని, బుకింగ్ ప్రక్రియ సాధారణంగానే కొనసాగుతోందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత కొన్ని రోజుల్లో 123 కేసులు నమోదు చేసి, 264 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
👉 ఇంధన కొరతపై మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి 💬
👉 మరిన్ని అప్డేట్స్ కోసం Mana Nizamabad ను ఫాలో అవ్వండి 🔔

Follow Our WhatsApp Channel