Posts

Showing posts with the label Mayor election Nizamabad

ఏసీ రూములు వదిలి జనం బాట పట్టండి.. ఇంచార్జి మంత్రి సీతక్క

Image
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమం ఒక యజ్ఞంలా ప్రారంభమైందని ఇంచార్జి మంత్రి సీతక్క చెప్పారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఆమె. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు ​రాబోయే 99 రోజులు అత్యంత కీలకమని, ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ​ఏసీ గదులకే పరిమితం కాకుండా, అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ 'ప్రగతి ప్రణాళిక' ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అధిక...

అన్నదమ్ముల సవాల్ - ధర్మపురి బ్రదర్స్ వార్

Image
(జమాల్పూర్ గణేష్ మూల్పూర్ రాజేంద్ర బాబు) వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండి బిడ్డలు..వైరి పక్షాల్లో కీలక నేతలే వారు..మాట వారుసకైనా ఆ అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడాలు లేదు.. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ మయ్యింది.. వారెవరో కాదు.ఒకరు ఎంపీ ధర్మపురి ఆరవింద్.. మరొకరు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్. మునిసిపల్ ఎన్నికల ముందు సంజయ్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేయర్ ఎన్నికల కోసం అప్పటికే పార్టీ శిక్షణ లో ఉన్న సంజయ్ని హుటాహుటిన నిజామాబాద్ రప్పించారు. తనదైన స్టయిల్ లో సంజయ్ ఎన్నికల సమరంలో దిగారు.. అంతర్గత సమావేశాల్లో,ప్రెస్ మీట్స్ సైతం తమ్ముడు అర్వింద్ పేరు ప్రస్తావించకుండానే సుతి మెత్తగా మత రాజకీయాలతో లబ్ది కోసం తపించడం సరికాదని హిత బోధ చేశారు. నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి ఆటంకం అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన పీస్ ర్యాలీలోనూ అర్వింద్ పేరు తీసుకోకుండానే పరోక్ష ప్రస్తావనకే పరిమితం అయ్యారు సంజయ్.. కానీ ఆదివారంనాడు సంజయ్ నిర్వహించిన మున్నూరు కాపు కార్పొరేటర్లు,కౌన్సిలర్ల సన్మానానికి బీజేపీ ప్ర...