అన్నదమ్ముల సవాల్ - ధర్మపురి బ్రదర్స్ వార్

(జమాల్పూర్ గణేష్ మూల్పూర్ రాజేంద్ర బాబు) వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండి బిడ్డలు..వైరి పక్షాల్లో కీలక నేతలే వారు..మాట వారుసకైనా ఆ అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడాలు లేదు.. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ మయ్యింది.. వారెవరో కాదు.ఒకరు ఎంపీ ధర్మపురి ఆరవింద్.. మరొకరు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్. మునిసిపల్ ఎన్నికల ముందు సంజయ్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేయర్ ఎన్నికల కోసం అప్పటికే పార్టీ శిక్షణ లో ఉన్న సంజయ్ని హుటాహుటిన నిజామాబాద్ రప్పించారు. తనదైన స్టయిల్ లో సంజయ్ ఎన్నికల సమరంలో దిగారు.. అంతర్గత సమావేశాల్లో,ప్రెస్ మీట్స్ సైతం తమ్ముడు అర్వింద్ పేరు ప్రస్తావించకుండానే సుతి మెత్తగా మత రాజకీయాలతో లబ్ది కోసం తపించడం సరికాదని హిత బోధ చేశారు. నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి ఆటంకం అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన పీస్ ర్యాలీలోనూ అర్వింద్ పేరు తీసుకోకుండానే పరోక్ష ప్రస్తావనకే పరిమితం అయ్యారు సంజయ్.. కానీ ఆదివారంనాడు సంజయ్ నిర్వహించిన మున్నూరు కాపు కార్పొరేటర్లు,కౌన్సిలర్ల సన్మానానికి బీజేపీ ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. అయినా బీజేపీ పెద్దనాయకుడు అడ్డుపడ్డాడని ఆవేదన వ్యక్తంచేశారు.కోపం గొంతు దాట కుండా అదిమి పట్టుకున్నారు.. అర్విందే అడ్డం పడ్డాడని చెప్పలేక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత అవమానకర పరిస్థితి ఎదురైనా తమ్ముడిపై రాజకీయ దాడి చేయకుండా సంయమనం పాటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకింత నిరసన వ్యక్తం చేశారు ధర్మపురి సంజయ్. అర్వింద్ కట్టడి చేయడంతో రాని కార్పొరేటర్ల పేర్లను అతికించి కుర్చీలకే సన్మానం చేశారు కానీ తమ్మున్ని బజారులో పెట్టలేదు అన్నగా సంజయ్.. తమ్ముడిదీ అదే తీరు.. తమ్ముడు అర్వింద్ కూడా అన్న సంజయ్ బాటలోనే నడుస్తున్నారు.. సందర్భం ఏదైనా తన అన్న సంజయ్ ని టార్గెట్ చేయడంలో సాహసం చేయడం లేదు. అన్నీ తానే అయ్యి నిజామాబాద్ బల్దియా పోరులో కాంగ్రెస్ తో టగ్గాఫర్ గా కొట్లాడిన సందర్భంలో అర్వింద్ అన్న సంజయ్ ను ప్రస్తావించలేదు. మత రాజకీయాలు,స్మార్ట్ సిటీ విమర్శలు సంజయ్ చేసినా..విల్లు మాత్రం పీసీసీ చీఫ్ పైనే ఎక్కు పెట్టారు అనేకసార్లు అర్వింద్.రెండేళ్లలో ఇప్పటివరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అన్న సంజయ్ విమర్శలను పట్టుంచుకోని అర్వింద్ అంతరంగం మీద కూడా చర్చ జరుగుతోంది. అన్నదమ్ముల నడుమ రాజకీయ ఆధిపత్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నా ..ఇద్దరూ వ్యక్తి సెంట్రిక్ గా విమర్శలు చేసుకోకుండా ఉండడం కాకతా లీయమో..దీని వెనుక ఇంకేమన్నా కథా కమామిషు ఉందో అంటూ విశ్లేషకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నరు..

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్