Posts

Showing posts with the label Mudiraj

ఇది నాగడ్డ.. అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ

Image
(జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్ర బాబు) ఇది నాగడ్డ..అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ ఈ పేటకు నేనే మేస్త్రి...నేనే ముఠా మెస్త్రి అనే రేంజ్ లో పట్టుబిగించారు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..దీంతో చేసేది ఏమిలేక కాంగ్రెస్ దిగ్గజాలు దిక్కులు చూస్తున్నారు. పీట ముడిని విప్పేది ఎట్లా అని తలలు పట్టుకుంటున్నారు..తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లో రసవత్తరమైన రాజకీయ క్రీడ క్యాడర్ ను సైతం కకలావికలం చేస్తోంది. ఇంతకీ ఆ పీట ముడి ఏంది? ఏమిటా కథ?మీ కోసం మన నిజామాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. డి. సత్యనారాయణ, డి. శ్రీనివాస్,సతీష్ పవార్, ఎండల లక్ష్మీ నారాయణ ,గణేష్ గుప్త లాంటి ఉద్దండులు ఏలిన నిజామాబాద్ పై మహేష్ గౌడ్ కన్ను పడింది. అతిసాధారణ NSUI కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మహేష్ అనేక రాజకీయ సునామీలను దాటుకుంటూ PCC పగ్గాలు అందుకున్నారు. అయినా ఎంపీ అర్వింద్ తో పాటు సొంత పార్టీ నేతలు సైతం వార్డు సభ్యుడిగా అయినా గెలిచాడా అంటూ దెప్పుపొడుస్తున్నారు. ఒక్కసారైనా అసెంబ్లీలో అధ్యక్షా అనక పోతే రాజకీయ జీవితం పరిపూర్ణం కాదని బలంగా నమ్...