ఇది నాగడ్డ.. అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ
(జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్ర బాబు)
ఇది నాగడ్డ..అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ ఈ పేటకు నేనే మేస్త్రి...నేనే ముఠా మెస్త్రి అనే రేంజ్ లో పట్టుబిగించారు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..దీంతో చేసేది ఏమిలేక కాంగ్రెస్ దిగ్గజాలు దిక్కులు చూస్తున్నారు. పీట ముడిని విప్పేది ఎట్లా అని తలలు పట్టుకుంటున్నారు..తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లో రసవత్తరమైన రాజకీయ క్రీడ క్యాడర్ ను సైతం కకలావికలం చేస్తోంది. ఇంతకీ ఆ పీట ముడి ఏంది? ఏమిటా కథ?మీ కోసం మన నిజామాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. డి. సత్యనారాయణ, డి. శ్రీనివాస్,సతీష్ పవార్, ఎండల లక్ష్మీ నారాయణ ,గణేష్ గుప్త లాంటి ఉద్దండులు ఏలిన నిజామాబాద్ పై మహేష్ గౌడ్ కన్ను పడింది. అతిసాధారణ NSUI కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మహేష్ అనేక రాజకీయ సునామీలను దాటుకుంటూ PCC పగ్గాలు అందుకున్నారు. అయినా ఎంపీ అర్వింద్ తో పాటు సొంత పార్టీ నేతలు సైతం వార్డు సభ్యుడిగా అయినా గెలిచాడా అంటూ దెప్పుపొడుస్తున్నారు. ఒక్కసారైనా అసెంబ్లీలో అధ్యక్షా అనక పోతే రాజకీయ జీవితం పరిపూర్ణం కాదని బలంగా నమ్ముతున్నారు మహేష్.. అందుకే PCC పగ్గాలు చేపట్టిన వెంటనే అసెంబ్లీ సెగ్మెంట్లో దస్తి వేయడానికి సెర్చ్ చేశారు.. నిజామాబాద్ సరైందని మకాం వేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే నిజామాబాద్ షిప్ట్ అయిన షబ్బీర్ అలీ అనుహ్యంగా 60వేల ఓట్లు సాధించి పట్టు నిలుపు కున్నారు. మునిసిపల్ ఎన్నికలను తానొక్కడే హ్యాండిల్ చేసిన మహేష్ గౌడ్.. షబ్బీర్ అలీని అర్బన్ లో మై నారిటీలకు షాది ముబారక్ చెక్కులు ఇచ్చి వచ్చిన దారిన వెళ్లేలా చేశారు... ఇక అసలు పేచీ డి. శ్రీనివాస్ తనయుడు,ఫస్ట్ మేయర్ ధర్మపురి సంజయ్ కాడ మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో సంజయ్ అభ్యర్దిత్వాన్ని పరిశీలించినా ఫలితం దక్కలేదు. ఆతరువాత ఆయన అలిగి అటకెక్కారు కొంత కాలం.. ఎంత కాలం ఇట్లా అచేతనంగా ఉండాలని సీఎం రేవంత్ ఆయన మిత్ర మండలిని ప్రసన్నం చేసుకున్నారు సంజయ్. అయినా మహేష్ సందు ఇవ్వలేదు.. జిల్లా కాంగ్రెస్ గుత్తేదార్ గా పేరున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రసాని పాత్ర పోషించారు. అయినా లాభం లేదు.. పదవి ఇచ్చి గుర్తింపు ఇవ్వకుంటే బాగుండదని సంకేతాలు ఇచ్చారు..కానీ నిజామాబాద్ నా అడ్డా.. ఎవరోస్తారో చూస్తా అనే రేంజిలో ముఠా మెస్త్రి లో చిరంజీవిని మరిపిస్తున్నరు మహేష్ గౌడ్.. అప్పటి నుండి ముక్యనేతలంతా జిల్లా టూర్ లో మహేష్ ను కలిసినా సంజయ్ మాత్రం దూరంగా ఉంటున్నారు.. ఇప్పటికి ఇప్పుడు మహేష్ గౌడ్ ను కాదని చేసేదేమీలేక సీఎం,సుదర్శన్ రెడ్డి మీద భారం వేసి కాలం కలిసి రాకపోతుందా అనే గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న సంజయ్ సుదర్శన్ రెడ్డి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.. ... మున్నూరు కాపుల ఫర్ములా; ......... డి. శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానంలో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎంత నిష్ఠురపు మాటలన్న గుండు గుత్తగా ఓట్లేసి అండగా నిలిచారు. అర్వింద్ రెండు సార్లు పార్లమెంట్ మెట్లు ఎక్కడంలోను నిచ్చెన వలె నిలిచారు మున్నూరు కాపులు.. ఈ సమీకరణ వెలుగులోనే విద్యాధికురాలు అయిన పంచారెడ్డి పరివారం మేయర్ పీఠాన్ని ఆశించింది.. అయినా మహేష్ గౌడ్ ప్రత్యామ్నాయ రాజకీయ సమీకరణను తెరమీదకు తెచ్చి ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన చిన్నప్పటి దోస్తు కరాటే రమేష్ సతీమణి కూరగాయల ఉమను మేయర్ పీఠం మీద కూర్చోపెట్టడం ముందస్తు వ్యూహమే. కొంచెం అటు ఇటుగా మున్నూరు కాపు వర్గానికి సంఖ్యా పరంగా సరితూగే ముదిరాజ్ లను మచ్చిక చేసుకుని అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నట్లు మహేష్ అంచనా.. అందుకే సందు దొరికితే చాలు నిజామాబాద్ లో వాలుపోతున్నారు మహేష్ గౌడ్.. చావులు,లగ్గాలు, పండుగ పబ్బాలు అనే తేడా లేకుండా పిలిస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలుతున్నారు PCC చీఫ్..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel