Posts

Showing posts with the label Police Life India

పాపం ట్రాఫిక్ పోలీసన్నకు ఎంత కష్టం..ఎంత నష్టం?

Image
ఐదు లక్షల జనాభా.. వేలాది ద్విచక్ర వాహనాలు..వందలాది కార్లు..డినికితోడు 4 వందల ఆర్టీసీ బస్సులు, పదివేల వరకు ఆటోలు, సుమారు 500 లారీలు ఇలా చెప్పుకుంటూ పోతే అంబులెన్సులు, సైకిల్లు, జీపులు, ప్రవేట్ వాహనాలు,తోపుడు బండ్లు.. అబ్బబ్బా వీటన్నింటినీ నియంత్రణ చేసి ఒక క్రమ పద్ధతిలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ .. నిరంతరం 24 గంటలు ఎండ, వాన, చలిలో సైతం కాపల దారుల్లా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు ఎవరో తెలుసా?... అదేనండి మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. కానీ విచిత్రం ఏమిటంటే ..నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ ల సంఖ్య కేవలం 50 నుండి 60 మంది మాత్రమే ఉంటారంటే మీరు నమ్ముతారా....? పైగా వీరికి ముఖ్యంగా తీవ్రమైన ఎండ తాకిడికి వచ్చే పలు రకాల వ్యాధులు, బిపి, షుగర్, వినికిడి సమస్య లాంటి సమస్యతోపాటు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి ఎంతో వెంటాడు తున్నప్పటికీ పొట్ట కూటి కోసం భరించక తప్పడంలేదు. వాటన్నిటిని విధుల నిర్వహనలో భాగంగా అనుకుంటూ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురవ్వకుండా ప్రమాదాలను కట్టడి చేస్తున్న మ...