పాపం ట్రాఫిక్ పోలీసన్నకు ఎంత కష్టం..ఎంత నష్టం?

ఐదు లక్షల జనాభా.. వేలాది ద్విచక్ర వాహనాలు..వందలాది కార్లు..డినికితోడు 4 వందల ఆర్టీసీ బస్సులు, పదివేల వరకు ఆటోలు, సుమారు 500 లారీలు ఇలా చెప్పుకుంటూ పోతే అంబులెన్సులు, సైకిల్లు, జీపులు, ప్రవేట్ వాహనాలు,తోపుడు బండ్లు.. అబ్బబ్బా వీటన్నింటినీ నియంత్రణ చేసి ఒక క్రమ పద్ధతిలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ .. నిరంతరం 24 గంటలు ఎండ, వాన, చలిలో సైతం కాపల దారుల్లా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు ఎవరో తెలుసా?... అదేనండి మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. కానీ విచిత్రం ఏమిటంటే ..నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ ల సంఖ్య కేవలం 50 నుండి 60 మంది మాత్రమే ఉంటారంటే మీరు నమ్ముతారా....? పైగా వీరికి ముఖ్యంగా తీవ్రమైన ఎండ తాకిడికి వచ్చే పలు రకాల వ్యాధులు, బిపి, షుగర్, వినికిడి సమస్య లాంటి సమస్యతోపాటు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి ఎంతో వెంటాడు తున్నప్పటికీ పొట్ట కూటి కోసం భరించక తప్పడంలేదు. వాటన్నిటిని విధుల నిర్వహనలో భాగంగా అనుకుంటూ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురవ్వకుండా ప్రమాదాలను కట్టడి చేస్తున్న మన ట్రాఫిక్ పోలీస్ అన్నలకి మనసున్న మహారాజులు శభాష్ అనకుండా ఉండలేరు.వాహనదారులకు, పాదాచారులకు ఆకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తునప్పుడు వారిని వెంటనే కుటుంబ సభ్యులుగా భావించి సమీప వైద్యశాలలకు తరలించి సత్వర చికిత్సకు సహకరించి కుటుంబ సభ్యుడి పాత్ర పోషించిన అనేక సంఘటనలు ఉన్నాయి.ఇదీ మన నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ సేవా తత్వం.మానవ సేవా.. పాపం పోలీస్ అన్న మీ గోసను గుర్తించేది ఎవరన్నా..షెల్యూట్ ఇందూరు ట్రాఫిక్ పోలీస్..

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్