Posts

Showing posts with the label RSS Chief Speech

హిందువుల ఐక్యత కోసమే ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన : కందకుర్తిలో మోహన్ భగవత్

Image
దేశంలో ఉన్న హిందువులను ఐక్యం చేయడానికే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెంజల్ మండలంలోని మండలంలోని కందకుర్తి లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెడ్గేవార్ జననం, మరణం నాగ్పూర్లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని సంకల్పించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు ఓ డాక్యుమెంటరీ వీడియో ద్వారా పూర్తిగా తెలిసిందన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి.. గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు ...