హిందువుల ఐక్యత కోసమే ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన : కందకుర్తిలో మోహన్ భగవత్
దేశంలో ఉన్న హిందువులను ఐక్యం చేయడానికే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెంజల్ మండలంలోని మండలంలోని కందకుర్తి లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెడ్గేవార్ జననం, మరణం నాగ్పూర్లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని సంకల్పించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు ఓ డాక్యుమెంటరీ వీడియో ద్వారా పూర్తిగా తెలిసిందన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి..
గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు భారత్ను పాలించారన్నారు. హిందువులు ఏకంగా లేకపోవడంతోనే ఇది జరిగిందన్నారు. భవిష్యత్లో సైతం హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆయన భావించారని చెప్పారు. దీంతో హిందువుల్లో చైతన్యం కోసం ఆర్ఎస్ఎస్ను స్థాపించారని ఆయన స్పష్టం చేశారు. 32 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున(ఏప్రిల్ 11, 1994)లో స్ఫూర్తి మందిరానికి బీజం పడిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. కందకుర్తిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తక్కువ స్థలంలో మందిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హిందూ సమాజంలోని ఐక్యమత్యాన్ని పెంచేందుకు ప్రాంత, భాష బేధాలున్నప్పటికీ డా. హెగ్దేవార్ చేసిన కృషి అమోఘమన్నారు. వందేళ్లక్రితం జ్ఞాన, శీల సంపన్నం కోసం డాక్టరీ ఆర్ఎస్ఎస్ స్థాపించారన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel