Posts

Showing posts with the label SC ST commission

VDC ఆగడాలకు అడ్డుకట్ట.. దళితులు రాజీపడొద్దు: ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య

Image
నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ లు ఆయా గ్రామాల్లో విధించే సాంఘిక బహిష్కరణలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందులో దళితులు రాజీ పడాల్సిన అవసరం లేదని, దీనికై త్వరలోనే మరిన్ని కఠినమైన చట్టాల అమలుకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఉద్గటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి తన వ్యక్తిగత పనులపై వచ్చిన చైర్మన్ మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు నివేదికల సహకారంతో జూన్ మాసంలో డీజీపీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా దళిత గిరిజనులకు దేవాలయాల ప్రవేశ నిషేధం, పరువు హత్యలు, లాంటివి జరగకుండా ఉండేందుకు ఈ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ల లో ఉన్న లోపాల గుర్తింపు వాటి సవరణలు లాంటి అనేక అంశాల్లో ఉన్న సంస్కరణలతో మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ న్ని దేశానికి రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్లు సభ్యులతో చర్చలు సంప్రదింపులు జరిపామన్నారు. న్యాయశా...