VDC ఆగడాలకు అడ్డుకట్ట.. దళితులు రాజీపడొద్దు: ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య
నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ లు ఆయా గ్రామాల్లో విధించే సాంఘిక బహిష్కరణలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందులో దళితులు రాజీ పడాల్సిన అవసరం లేదని, దీనికై త్వరలోనే మరిన్ని కఠినమైన చట్టాల అమలుకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఉద్గటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి తన వ్యక్తిగత పనులపై వచ్చిన చైర్మన్ మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు నివేదికల సహకారంతో జూన్ మాసంలో డీజీపీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా దళిత గిరిజనులకు దేవాలయాల ప్రవేశ నిషేధం, పరువు హత్యలు, లాంటివి జరగకుండా ఉండేందుకు ఈ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ల లో ఉన్న లోపాల గుర్తింపు వాటి సవరణలు లాంటి అనేక అంశాల్లో ఉన్న సంస్కరణలతో మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ న్ని దేశానికి రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్లు సభ్యులతో చర్చలు సంప్రదింపులు జరిపామన్నారు. న్యాయశాఖ మంత్రులతో పాటు, కేంద్ర సంబంధిత ఆయా శాఖల మంత్రులతో కూడా తాను మాట్లాడానని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ కేసులు పరిష్కారంలో పురోగతిని గురించి మాట్లాడుతూ ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే నిబంధన ఉత్తర్వులు అవరోధంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు ఉన్న ఉన్నతాధికారుల ప్రమేయంతో ఎస్సీ ఎస్టీ కేసులు నీరుగార్చడానికి చేసే ప్రయత్నాలు సహించమని పేర్కొన్నారు. తాను చైర్మన్ పదవి చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో ఉద్యోగస్తులకు రోస్టర్ పాయింట్లలో ఉన్న లోపాల గుర్తింపు వాటి సవరణలు లాంటి అనేక సంస్కరణలో చేపట్టి మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దేశానికే రోల్ మోడల్ గా నిలబడ నిలబెడతానని అభిప్రాయపడ్డారు. దళిత గిరిజన బాధితులకు రెండు వేల వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అర్హత మేరకు వందలాది ఉద్యోగాలు జాప్యం లేకుండా నష్టపరిహారాలు తన రెండున్నర ఏళ్ల పదవీకాలంలో ఇప్పించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మారుమూల గ్రామం లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిన ఒక్క ఫోన్ కాల్ తో క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులను సమన్వయపరిచి యుద్ధ ప్రాతిపదికన సత్వర చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. దోషులకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, సాంఘిక శాఖ మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీ గిరిజనులకు న్యాయం జరిగేలా చేస్తామని పునరుద్ఘాటించారు. మన నిజామాబాద్ ఛానల్ తో మాట్లాడిన అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలవడానికి దళిత సంఘాలు పుష్పగుచ్చాలు ఇచ్చి వినతి పత్రాలు అందజేశారు. దాంతోపాటు ఆయనను ఘనంగా సన్మానించారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel