తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.. నాలుగు కేటగిరీల ప్రతిపాదనలు
నాలుగు కెటగిరీల్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఆదివారం జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ఫ్రొ,, కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.. అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ , కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప...