తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.. నాలుగు కేటగిరీల ప్రతిపాదనలు

నాలుగు కెటగిరీల్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఆదివారం జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ఫ్రొ,, కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.. అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ , కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉద్యమకారులను గుర్తించడానికి నాలుగు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది కమిటీ.
1.తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన 2. ఉద్యమంలో గాయపడిన వారికి రెండవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదన. 3. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు ,అరెస్టులు అయిన వారు ,తెలంగాణ ఉద్యమ కేసులు అయిన వారు మూడవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదన.. 4. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదించారు. నాలుగవ కేటగిరి గుర్తించడానికి వారు ఉద్యమంలో చేసిన పేపర్ కటింగ్స్ చూడాలని ప్రతిపాదన తెలంగాణ ఉద్యమంలో పౌరసమాజం లో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలి 1969,1972,1996 ఉద్యమకారులతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. తెలంగాణ ఉద్యమస్థిత్వాన్ని కాపాడేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిందని రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరుగుతుందని సమావేశంలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కొంత మందికి మాత్రమే సహాయం అందించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ నుండి రాగానే కమిటీ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపి కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి తో చర్చించాలని కమిటీ నిర్ణయించింది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్