Posts

Showing posts with the label Telangana Excise News

ఆబ్కారీ పోలీసులా.. మజాకా..

Image
మాయ చేసి మత్పరించడంలో నిజామాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు ఎవరూ సరి రారని నిరూపిస్తున్నారు.మాటలు కోటలు దాటినా వారి చేతిలో ఉన్న లాఠీ ఆఫీసు గడప దాటదని రూఢి అవుతోంది. తెల్లవారు జాము మద్యం అమ్మకాలను నియంత్రించామని,బెల్టు షాపులను మూసేయించామని ఎక్సయిజ్ పోలీసుల ప్రకటనలు భూటకమని తేలిపోయింది. మద్యం వ్యాపారులతో ఉన్న నోట్ల బంధం ముందు విధులు బలా దూర్ అని తేలిపోయింది. ఈ పరిణామాలకు అద్దం పడుతోంది నిజామాబాద్ మద్యం అమ్మకాల తీరు. నిజామాబాద్ నగరం నలుమూలల్లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున నుంచే వైన్స్,బార్ షాపుల్లో లిక్కర్ అమ్ముతున్న విషయాన్ని మన నిజామాబాద్ స్టింగ్ ఆపరేషన్తో బయట పెట్టింది.అయితే అలాంటి షాపులపై చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ SHO స్వప్న ఖరాఖండిగా చెప్పిన మాటలు గాలివాటమివే అని తేలిపోయింది. స్టింగ్ ఆపరేషన్ జరిపిన మరుసటిరోజు తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టారు స్వప్న. ఆ మరుసటిరోజు నుంచే నిజామాబాద్ అంతటా యధావిధిగా తెల్లవారుజామున నుంచే బార్ షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అయితే లిక్కర్ సిండికేట్ తో ఉన్న లాలూచీ వల్లే బజారులో బజాప్తాగా అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది.జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వ...