ఆబ్కారీ పోలీసులా.. మజాకా..

మాయ చేసి మత్పరించడంలో నిజామాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు ఎవరూ సరి రారని నిరూపిస్తున్నారు.మాటలు కోటలు దాటినా వారి చేతిలో ఉన్న లాఠీ ఆఫీసు గడప దాటదని రూఢి అవుతోంది. తెల్లవారు జాము మద్యం అమ్మకాలను నియంత్రించామని,బెల్టు షాపులను మూసేయించామని ఎక్సయిజ్ పోలీసుల ప్రకటనలు భూటకమని తేలిపోయింది. మద్యం వ్యాపారులతో ఉన్న నోట్ల బంధం ముందు విధులు బలా దూర్ అని తేలిపోయింది. ఈ పరిణామాలకు అద్దం పడుతోంది నిజామాబాద్ మద్యం అమ్మకాల తీరు. నిజామాబాద్ నగరం నలుమూలల్లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున నుంచే వైన్స్,బార్ షాపుల్లో లిక్కర్ అమ్ముతున్న విషయాన్ని మన నిజామాబాద్ స్టింగ్ ఆపరేషన్తో బయట పెట్టింది.అయితే అలాంటి షాపులపై చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ SHO స్వప్న ఖరాఖండిగా చెప్పిన మాటలు గాలివాటమివే అని తేలిపోయింది. స్టింగ్ ఆపరేషన్ జరిపిన మరుసటిరోజు తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టారు స్వప్న. ఆ మరుసటిరోజు నుంచే నిజామాబాద్ అంతటా యధావిధిగా తెల్లవారుజామున నుంచే బార్ షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అయితే లిక్కర్ సిండికేట్ తో ఉన్న లాలూచీ వల్లే బజారులో బజాప్తాగా అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది.జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వర్తించే ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి,ES మల్లారెడ్డిని సైతం మిస్ గైడ్ చేస్తున్నట్టు కనబడుతోంది.
కల్లు ముస్తాదార్ అండ;
రాజకీయ పలుకుబడి ఉన్న స్థానిక కల్లు ముస్తాదార్ అండతో SHO ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అధికార పార్టీ పెద్ద నాయకుడి ప్రాపకం ఉందనే ధీమాతో మద్యం సిండికేట్ కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.. దీనిలో భాగంగానే నిజామాబాద్ నగరంలో లైసెన్సులు లేని అక్రమ కల్లు దుకాణాలు సైతం బహిరంగంగానే నడుస్తున్నాయి. అయినా ఆబ్కారీ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు.. మొత్తానికి ప్రభుత్వ నిబంధనలను ఆబ్కారీ అధికారులే కాల రాయడం కొసమెరుపు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్