Posts

Showing posts with the label VG Goud

నో టికెట్ గ్యారెంటీ..! గేరు మార్చిన బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) కారు పార్టీ గేరు మార్చింది.. ఆ స్పీడుకు MLA టికెట్ల ఆశావాహుల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రామన్న, హరిషన్న చుట్టూ ప్రదక్షిణ చేసి.. మస్క పాలిస్ తో టికెట్ కొట్టేయొచ్చనే ఆశలు ఆడియాసలే నన్న అంచనా కొచ్చారు BRS మాజీ MLA లు..ఇంత కాలం పట్న వాసానికి మరిగిన వీళ్ళు అబ్బా మళ్ళీ ఊరు బాట పట్టాలా అంటూ ఉసూరు మంటున్నారు..10ఏళ్ళు అధికారం చెలాయించి, సుఖానికి మరిగిన మాజీ MLA లు ఇప్పుడిపుడే పల్లె బాటను వెతుక్కుంటున్నరు. ఎవరికి వారు విధిగా ఓడిన చోటే విజయానికి మెట్లు వేసుకుంటారేనని అధిష్ఠానం రెండేళ్లు సమయం ఇచ్చి చూసింది.. అయినా మాజీలు పట్నం వీడలేదు.. అందుకే బూతు లెవల్ లో పార్టీ నిర్మాణం, సర్ ప్రోగ్రామ్ ను జోడించి అధిష్టానమే కార్యాచరణ ఇచ్చింది. దీనితో తప్పని పరిస్థితుల్లో మాజీ MLA లు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మాజీలు టీమ్ గా ఏర్పడి పర్యటిస్తున్నారు.. అయినా వారిని టికెట్ నో గ్యారంటీ అనే మాట నిద్రపోనిస్తా లేదు. "గతాన్ని చూసి టికెట్లు ఇచ్చేది లేదు..ఎంత సీనియర్..ఎన్ని టర్మ్ లు MLA గా పని చేసారు అనేది ల...