నో టికెట్ గ్యారెంటీ..! గేరు మార్చిన బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు)
కారు పార్టీ గేరు మార్చింది.. ఆ స్పీడుకు MLA టికెట్ల ఆశావాహుల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రామన్న, హరిషన్న చుట్టూ ప్రదక్షిణ చేసి.. మస్క పాలిస్ తో టికెట్ కొట్టేయొచ్చనే ఆశలు ఆడియాసలే నన్న అంచనా కొచ్చారు BRS మాజీ MLA లు..ఇంత కాలం పట్న వాసానికి మరిగిన వీళ్ళు అబ్బా మళ్ళీ ఊరు బాట పట్టాలా అంటూ ఉసూరు మంటున్నారు..10ఏళ్ళు అధికారం చెలాయించి, సుఖానికి మరిగిన మాజీ MLA లు ఇప్పుడిపుడే పల్లె బాటను వెతుక్కుంటున్నరు. ఎవరికి వారు విధిగా ఓడిన చోటే విజయానికి మెట్లు వేసుకుంటారేనని అధిష్ఠానం రెండేళ్లు సమయం ఇచ్చి చూసింది..
అయినా మాజీలు పట్నం వీడలేదు.. అందుకే బూతు లెవల్ లో పార్టీ నిర్మాణం, సర్ ప్రోగ్రామ్ ను జోడించి అధిష్టానమే కార్యాచరణ ఇచ్చింది. దీనితో తప్పని పరిస్థితుల్లో మాజీ MLA లు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు.మాజీ మంత్రి
ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మాజీలు టీమ్ గా ఏర్పడి పర్యటిస్తున్నారు..
అయినా వారిని టికెట్ నో గ్యారంటీ అనే మాట నిద్రపోనిస్తా లేదు.
"గతాన్ని చూసి టికెట్లు ఇచ్చేది లేదు..ఎంత సీనియర్..ఎన్ని టర్మ్ లు MLA గా పని చేసారు అనేది లెక్క కాదు.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రజా సమస్యలపై ఈమేరకు స్పందిస్తున్నారు?స్థానికంగా అందుబాటులో ఉంటూ,క్యాడర్ ను కలుపుకొని వెళ్తున్నారా లేదా?గెలవడానికి అవకాశం ఉందా,లేదా?"అనే అంశాలపై కారు పార్టీ అధినాయకత్వం తరచుగా క్షేత్ర స్థాయిలో సర్వేలు చేస్తోంది.. వీటి ఆధారంగా మాత్రమే గెలుపు గుర్రాలైతే తప్ప వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ తేల్చేసింది. దీనితో ఉమ్మడి ఇందూర్ జిల్లా మాజీ MLA కంటి మీద కునుకులేకుండా పోయింది.సట్టం చూసి పీటలేయమని..మొఖాన్ని చూసి టికెట్లు ఇవ్వలేమని తేల్చేయడంతో పరేషాన్ లో పడ్డారు. అందుకే సొంత సెగ్మెంట్ల బాట పట్టారు .ముందు ఎన్నడూ లేనంత కఠినంగా వ్యవరిస్తున్న అధిష్టానం తీరు వల్ల నైనా మాజీలు హైదరాబాద్ నుంచి కదలక తప్పలేదు..పాపం మాజీలు..
.......
ప్రశాంత్ రెడ్డి కీలకం;
----------/
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కారు పార్టీకి సర్వం తానే అయ్యి వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి.పార్టీ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు..కమిటీలను రద్దు చేసిన తరువాత జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆర్ముర్కే పరిమితం అయ్యారు.భవిష్యత్తు లో జిల్లా పార్టీ పగ్గాలు మాజీ MLC VG గౌడ్ కు అప్పచెప్పదశనికి ప్రశాంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు..అందుకే VG గౌడ్ ప్రస్తుతం పార్టీ సభ్యత్వం నమోదు,SIR కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు..బాల్కొండ సెగ్మెంట్ MLA గా రెగ్యులర్గా అక్కడ అందుబాటులో ఉంటూనే VG గౌడ్ ద్వారా పార్టీ వ్యవహారాలు చేసుక్కబెట్టే పనిలో బిజీ అయ్యారు ప్రశాంత్ రెడ్డి.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel