Posts

Showing posts with the label Vemula Prashanth Reddy

బస్ స్టాండ్ జాగా కాంగ్రెస్ ఖాతాలో..

Image
నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమినీ దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూమిని కేటాయించడానికి BRS పార్టీ వ్యతిరేకం కాదు కానీ నగరంలోనే కోట్ల రూపాయల విలువైన మరియు ఇదివరకే ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించినటువంటి భూమిని అప్పనంగా కొట్టేయ్యడానికి మేము వ్యతిరేకమన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న R &B స్థలాన్ని గుర్తించి ప్రతిపదించామని ,అలాగే బస్టాండ్ నిర్మాణము కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు....