బస్ స్టాండ్ జాగా కాంగ్రెస్ ఖాతాలో..

నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమినీ దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని అన్నారు.
రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూమిని కేటాయించడానికి BRS పార్టీ వ్యతిరేకం కాదు కానీ నగరంలోనే కోట్ల రూపాయల విలువైన మరియు ఇదివరకే ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించినటువంటి భూమిని అప్పనంగా కొట్టేయ్యడానికి మేము వ్యతిరేకమన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న R &B స్థలాన్ని గుర్తించి ప్రతిపదించామని ,అలాగే బస్టాండ్ నిర్మాణము కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత అదే స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలకు అత్యవసరమైన రవాణా సదుపాయాలను పక్కనబెట్టి, పార్టీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శించారు.
జిల్లా కేంద్రంలో బస్టాండ్ కోసం ప్రత్యామ్నాయ స్థలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు చర్య అని అన్నారు. ఈ కేటాయింపుల వెనుక వాణిజ్య వ్యాపారా ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పార్టీ కార్యాలయం పేరు మీద కమర్సియల్ కంప్లెక్స్ నిర్మించి వ్యాపారం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.
నిజామాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం అత్యవసరమని, ఆ స్థలంలో ప్రజలకు కావాల్సింది అత్యధునిక ఆర్టీసీ బస్టాండ్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కంప్లెక్స్ కాదు అని అన్నారు.
ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆ స్థలాన్ని తిరిగి ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్