Posts

Showing posts with the label Vishwakarma Ekta Yatra

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,700 కి.మీ మహాపాదయాత్ర.. 25 డిమాండ్లతో విశ్వకర్మ ఏక్తా యాత్ర

Image
హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు 1700km మహాపాదయాత్ర - విశ్వకర్మ ఏక్తా యాత్ర. గుర్తింపు నుంచి గౌరవం వరకు నైపుణ్యం నుంచి ఆదాయం వరకు వృత్తి నుంచి పారిశ్రామిక శక్తి వరకు హైదరాబాద్ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు 74 రోజుల పాటు 1,700 వందల కిలోమీటర్ల మేర కొనసాగుతున్న విశ్వకర్మ ఏక్తా యాత్ర కేవలం ఒక పాదయాత్ర కాదని, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సోదరులను ఒకే జాతీయ దృష్టి కింద ఏకం చేసి, భవిష్యత్ తరాలకు బలమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు నాయకత్వ పునాదిని నిర్మించే కార్యాచరణ అని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ & ఫౌండర్ బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి అన్నారు. నాయకత్వం లేని సమాజం తన హక్కులను సమర్థంగా సాధించుకోలేదని, అందుకే విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్‌ను లీడర్స్ ఫ్యాక్టరీగా తీర్చిదిద్దుతూ జాతి కోసం అహర్నిశలు పనిచేసే యువ నాయకత్వాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. “నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః… విక్రమార్జితరాజ్యస్య స్వయమేవ మృగేంద్రతా” అనే శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం ఎవరో ఇచ్చేది కాదని, సామర్థ్యం, సేవ, కృషి, ధైర్యం ద్వారా సాధించుక...