హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,700 కి.మీ మహాపాదయాత్ర.. 25 డిమాండ్లతో విశ్వకర్మ ఏక్తా యాత్ర

హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు 1700km మహాపాదయాత్ర - విశ్వకర్మ ఏక్తా యాత్ర.
గుర్తింపు నుంచి గౌరవం వరకు నైపుణ్యం నుంచి ఆదాయం వరకు వృత్తి నుంచి పారిశ్రామిక శక్తి వరకు హైదరాబాద్ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు 74 రోజుల పాటు 1,700 వందల కిలోమీటర్ల మేర కొనసాగుతున్న విశ్వకర్మ ఏక్తా యాత్ర కేవలం ఒక పాదయాత్ర కాదని, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సోదరులను ఒకే జాతీయ దృష్టి కింద ఏకం చేసి, భవిష్యత్ తరాలకు బలమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు నాయకత్వ పునాదిని నిర్మించే కార్యాచరణ అని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ & ఫౌండర్ బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి అన్నారు. నాయకత్వం లేని సమాజం తన హక్కులను సమర్థంగా సాధించుకోలేదని, అందుకే విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్‌ను లీడర్స్ ఫ్యాక్టరీగా తీర్చిదిద్దుతూ జాతి కోసం అహర్నిశలు పనిచేసే యువ నాయకత్వాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. “నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః… విక్రమార్జితరాజ్యస్య స్వయమేవ మృగేంద్రతా” అనే శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం ఎవరో ఇచ్చేది కాదని, సామర్థ్యం, సేవ, కృషి, ధైర్యం ద్వారా సాధించుకోవాల్సినదని యువతకు పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధితో పాటు సమాజంలో జరిగే అన్యాయం, మోసాలు, దోపిడీపై చట్టబద్ధమైన మరియు ఆధారబద్ధమైన పద్ధతుల్లో ప్రశ్నించే చైతన్యం కూడా అవసరమని అన్నారు. విశ్వకర్మ సమాజం దేశవ్యాప్తంగా వివిధ భాషలు, ప్రాంతాల్లో అనేక పేర్లతో పిలవబడుతున్నప్పటికీ, మన సామాజిక–ఆర్థిక స్థితిగతులు, జనాభా, వృత్తులు, విద్య, ఉపాధి, ఆదాయం, అప్పులు, వలసలు మరియు ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రాతినిధ్యంపై సమగ్ర జాతీయ డేటా అవసరమని పుష్పగిరి అన్నారు. అందుకే జాతీయ విశ్వకర్మ సంక్షేమ & అభివృద్ధి కమిషన్, విశ్వకర్మ–సాంప్రదాయ శిల్పకారుల వ్యవహారాల కోసం ప్రత్యేక కేంద్ర వ్యవస్థ, జాతీయ సామాజిక–ఆర్థిక–వృత్తి డేటాబేస్, జాతీయ విశ్వకర్మ నైపుణ్య–సాంప్రదాయ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 25 డిమాండ్లలో ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పేర్లు, సంప్రదాయ వృత్తులు మరియు సంబంధిత సామాజిక వర్గీకరణలను అధికారిక గణాంక వ్యవస్థల్లో పారదర్శకంగా మ్యాపింగ్ చేయాలని, వాస్తవ జనాభా మరియు సామాజిక–ఆర్థిక పరిస్థితుల ఆధారంగా విద్య, ఉపాధి, పరిపాలనా మరియు రాజకీయ ప్రాతినిధ్యంపై అధ్యయనం చేయాలని కోరారు. “మన సంఖ్య ఎంత? మన ఆర్థిక స్థితి ఏమిటి? మన వృత్తులు ఎంతవరకు రక్షించబడ్డాయి? మన ప్రాతినిధ్యం ఎంత ఉంది?” అనే ప్రశ్నలకు అధికారిక డేటా ద్వారా సమాధానాలు రావాలని అన్నారు.
విశ్వకర్మల సాంప్రదాయ వృత్తులను కేవలం కుటుంబ జీవనోపాధిగా కాకుండా ఆధునిక పరిశ్రమలు, సాంకేతికత మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించాలని పుష్పగిరి అన్నారు. ప్రతి రాష్ట్రంలో విశ్వకర్మ ఇండస్ట్రియల్ కార్రిడార్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ , కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసి కమ్మరం, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్, మెషినింగ్, కార్పెంటరీ, కంచర, శిల్పకళ, స్వర్ణకార వృత్తులకు ఆధునిక యంత్రాలు, నైపుణ్య ధృవీకరణ, శిక్షణ, ముడి పదార్థాలు, మార్కెట్ మరియు ఎగుమతి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తక్కువ వడ్డీ రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక నిధి, ప్రభుత్వ కొనుగోళ్లలో అర్హత కలిగిన విశ్వకర్మలకు ప్రాధాన్యత విశ్వకర్మ మేడ్ ఇన్ ఇండియా బై ట్రేడిషనల్ క్రాఫ్ట్స్మెన్ జాతీయ బ్రాండ్, సామాజిక భద్రతా ప్యాకేజీ, ఆరోగ్య–ప్రమాద బీమా, వృద్ధాప్య పింఛన్, వృత్తి ప్రమాద పరిహారం వంటి అంశాలను కూడా చేర్చామని తెలిపారు. అదే సమయంలో శిల్పశాస్త్రం, వాస్తు, దేవాలయ నిర్మాణం, శిల్పకళ, విశ్వకర్మ పురోహితుల సంప్రదాయ జ్ఞానం, దేవాలయాలు, పాత వర్క్‌షాపులు, పరికరాలు, మాన్యుస్క్రిప్టులు మరియు మౌఖిక సంప్రదాయాలను డాక్యుమెంట్ చేసి భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రత్యేక సంస్థలు, పరిశోధన మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని చెప్పారు. చివరికి ప్రతి అర్హత కలిగిన విశ్వకర్మ కుటుంబానికి.స్కిల్స్ టూల్స్ క్యాపిటల్ మార్కెట్ సోషల్ సెక్యూరిటీ అనే ఐదు ఆధారాలతో గౌరవప్రదమైన, స్థిరమైన జీవనోపాధి కల్పించడమే తమ 25 డిమాండ్ల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ 25 జాతీయ డిమాండ్లను విశ్వకర్మ జాతీయ అభివృద్ధి చార్టర్–2026 గా దేశం ముందుంచుతున్నామని, ఈ డిమాండ్లపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించి, విశ్వకర్మ సమాజం యొక్క సామూహిక స్వరాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే విశ్వకర్మ ఏక్తా యాత్ర లక్ష్యమని బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి అన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ బోరబండ నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర నవంబర్ 29న దేశ రాజధాని ఢిల్లీలో భారీ ముగింపు సభతో ముగుస్తుందని తెలిపారు. “ఇది ఒక్కరి యాత్ర కాదు… ఇది ప్రతి విశ్వకర్మ కుటుంబం యొక్క యాత్ర. ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి పట్టణం నుంచి, ప్రతి గ్రామం నుంచి మన బంధువులు ఢిల్లీకి తరలిరావాలి. జిల్లా నుంచి ఢిల్లీ వరకు – ప్రతి ఇంటి నుంచి ఒక అడుగు ఢిల్లీ వైపు!” అని పిలుపునిచ్చారు. 25 డిమాండ్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సోదరులు, యువత, మహిళలు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, కళాకారులు మరియు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో జరిగే ముగింపు సభకు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను, సంఘటిత స్వరాన్ని దేశానికి చాటాలని కోరారు. “హైదరాబాద్ నుంచి ప్రారంభమైన అడుగు… ఢిల్లీలో జాతీయ స్వరంగా మారాలి. మన భవిష్యత్తు కోసం మనమే ముందుకు రావాలి” అని పుష్పగిరి పిలుపునిచ్చారు. ఈరోజు కామారెడ్డి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుండి ఈరోజు బయలుదేరిన వారిలో ఆలయ పూజారి శీర్లవంచ కృష్ణమాచార్యులు కొంత దూరం పాల్గొన్నారు ఈ యాత్రలో రామయ్య చారి, మహారాణి దీన్ విశ్వకర్మ, నరేష్ చారి, రవి చారి, సత్తయ్య చారి, నరేందర్ చారి తదితరులున్నారు
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

ఇది నాగడ్డ.. అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్