ఎక్స్‌క్లూజివ్ స్టింగ్ ఆపరేషన్ 🔴 తెల్లవారుజామునే లిక్కర్ విక్రయాలు..! నిజామాబాద్‌లో ఎక్సయిజ్ నిర్లక్ష్యం?
నిజామాబాద్ ఎక్సయిజ్ పోలీసులు అవినీతి మత్తులో పీకల లోతు కూరుకు పోయారు.అధికారులే చట్టాన్ని ఉల్లంఘించి,పచ్చనోట్ల కట్టలకు మరిగి తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు.. పర్యవసానంగా నిజామాబాద్ నగరం నట్టనడుమ మందు బాబులకు పొద్దున్నుండి లిక్కర్ విచ్చల విడిగా అందుతోంది. ఈ తతంగాన్ని కళ్ళకు కట్టినట్లు బయట పెట్టడానికి మన నిజామాబాద్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా విస్తుపోఏ నిజాలు బయట పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ మటన్ మార్కెట్ కు ఆనుకుని ఉన్న ఒక పురాతన ఇంట్లో నడుస్తున్న బెల్ట్ షాప్ వద్ద మందు బాబులు పొద్దున ఆరు గంటలకే లిక్కర్ సేవిస్తున్నారు.. ఇక్కడ తెల్లవారుజాము నుంచే బజాప్తాగా అనధికారికంగా లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నా దృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడికి కూత వేటు దూరంలో శివాజీ నగర్ లక్ష్మి బార్ లో గ్రౌండ్ ప్లోర్ లో అక్రమంగా ఉదయం 7 గంటలకే లిక్కర్ తాగుతున్నారు. కోటగల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న sss బార్ లో కూడా ఉదయం ఏడున్నర గంటలకు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కింది ఫ్లోర్ లో బాహాటంగానే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వినాయక్ నగర్ బొర్గామ్ లో ప్రధాన ...