ఎక్స్‌క్లూజివ్ స్టింగ్ ఆపరేషన్ 🔴 తెల్లవారుజామునే లిక్కర్ విక్రయాలు..! నిజామాబాద్‌లో ఎక్సయిజ్ నిర్లక్ష్యం?
నిజామాబాద్ ఎక్సయిజ్ పోలీసులు అవినీతి మత్తులో పీకల లోతు కూరుకు పోయారు.అధికారులే చట్టాన్ని ఉల్లంఘించి,పచ్చనోట్ల కట్టలకు మరిగి తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు..
పర్యవసానంగా నిజామాబాద్ నగరం నట్టనడుమ మందు బాబులకు పొద్దున్నుండి లిక్కర్ విచ్చల విడిగా అందుతోంది.
ఈ తతంగాన్ని కళ్ళకు కట్టినట్లు బయట పెట్టడానికి మన నిజామాబాద్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా విస్తుపోఏ నిజాలు బయట పడ్డాయి.
వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ మటన్ మార్కెట్ కు ఆనుకుని ఉన్న ఒక పురాతన ఇంట్లో నడుస్తున్న బెల్ట్ షాప్ వద్ద మందు బాబులు పొద్దున ఆరు గంటలకే లిక్కర్ సేవిస్తున్నారు.. ఇక్కడ తెల్లవారుజాము నుంచే బజాప్తాగా అనధికారికంగా లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నా దృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు.
ఇక్కడికి కూత వేటు దూరంలో శివాజీ నగర్ లక్ష్మి బార్ లో గ్రౌండ్ ప్లోర్ లో అక్రమంగా ఉదయం 7 గంటలకే లిక్కర్ తాగుతున్నారు. కోటగల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న sss బార్ లో కూడా ఉదయం ఏడున్నర గంటలకు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కింది ఫ్లోర్ లో బాహాటంగానే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
వినాయక్ నగర్ బొర్గామ్ లో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న MSR బార్ లో అక్రమంగా మద్యం విక్రయాలు జరగడం మన నిజామాబాద్ టీమ్ కెమెరాకు చిక్కాయి.
ఇట్లా నగరం లో 50 ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సయిజ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
మల్లారెడ్డి మాట వెనుక...
పైగా అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారాలను మన నిజామాబాద్ ఛానల్ ఎక్సయిజ్ సూపరెంటెండెంట్ మల్లారెడ్డి దృష్టికి తీసుకెల్లే ప్రయత్నం చేయగా వింత,నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోనే నిబంధలకు వ్యతురేకంగా తెల్లవారు జామున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే.. 'అది అడగాల్సింది నన్నుకాదు ' అని తప్పించుకున్నారు మల్లారెడ్డి. ఉదయం 10 తరువాత వైన్స్ షాప్ ల్లో , 11 తరువాత బార్ ల్లో మద్యం అమ్మకాలు జరుపాలన్నది ప్రభుత్వ నిబంధన ఉంది. కలెక్టర్, ES ఇతర ఉన్నత అధికారులు ఉన్న నిజామాబాద్ నగరంలో తెల్లవారుజామున సాగుతున్న మద్యం అమ్మకాలపై మాట్లాడానికే ఆబ్కారీ పెద్దాఫీసర్ మల్లారెడ్డికి ఇష్టం లేకపోవడం పలు అనుమానాలకు వావిస్తోంది..
కలల లోకంలో స్వప్న;
ఎక్సయిజ్ SHO స్వప్న కూడా కలల లోకంలో విహరిస్తున్నట్లున్నారు.. నిజామాబాద్ నగరంలో తెల్లవారు మద్యం అమ్మకాలను కంట్రోల్ చేశామని.. బెల్ట్ షాపులను మూసేయించామని నిజాలను నిలువు పాతరేసే స్టేట్మెంట్ ఇచ్చారు SHO స్వప్న మేడం.. పేదల ఆగోగ్యాన్ని దెబ్బతీసే అక్రమ మద్యం అమ్మకాలను నియంత్రణకై చర్యలు తీసుకుంటారో..మేల్కొని కలలు కంటారో చూద్దాం...