Posts

Showing posts with the label city development

నిజామాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఆ రెండు ‘ఫ్లైఓవర్లు’ నిర్మిస్తేనే నగరానికి మహర్దశ!

Image
కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్లతో అలరారుతున్న మన నిజామాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు వెలకట్టలేనివి. కష్టనష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఆదర్శవంతమైన జీవనశైలితో ముందుకు సాగుతున్న మన నగరం గర్వించదగ్గ ఎన్నో విశేషాలకు నిలయం. అయితే, ఇంతటి అందమైన మన నగరానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య సవాలుగా మారింది. అదే ట్రాఫిక్ కష్టాలు. స్తంభిస్తున్న నగరం.. ఇబ్బందుల్లో జనం! జిల్లా కేంద్రంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వేలాది కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, భారీ లారీలు.. ఇలా ఒకటేమిటి, ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు నగర వీధుల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతుండటంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం ఒక్కటే: రెండు కీలక ఫ్లైఓవర్ల నిర్మాణం నగరంలో నెలకొన్న ఈ ట్రాఫిక్ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమస్యకు ప్రధానంగా రెండే రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు మరియు స్థానికులు అ...

నిజామాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 2026-27 ఆమోదం.. రూ.231కోట్ల వ్యయం

Image
నిజామాబాద్, నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 - 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ. 9471.33 లక్షలు, 2025-2026 సవరణ అంచనా ఆదాయం రూ. 13717.11 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 23188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026-2027 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 14763.60 లక్షలుగా బడ్జెట్ లో పొందుపర్చారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ. 9937.00 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం రూ. 24700.60 లక్షలుగా బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్...