నిజామాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 2026-27 ఆమోదం.. రూ.231కోట్ల వ్యయం
నిజామాబాద్,
నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 - 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ. 9471.33 లక్షలు, 2025-2026 సవరణ అంచనా ఆదాయం రూ. 13717.11 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 23188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026-2027 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 14763.60 లక్షలుగా బడ్జెట్ లో పొందుపర్చారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ. 9937.00 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం రూ. 24700.60 లక్షలుగా బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ వివరాలను సమావేశంలో చదివి వినిపించగా, సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా తమతమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం అని, నిజామాబాద్ నగర అభివృద్దే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ సూచించారు. నిజామాబాద్ నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నిజామాబాద్ లో మాస్టర్ ప్లాన్ అమలు అనివార్యంగా మారిందని అన్నారు. ఇప్పటికే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకు ముసాయిదా ప్లాన్ లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే వాటిని చేపట్టేందుకు వీలుగా కార్పొరేటర్లతో కూడా భేటీ నిర్వహించాలని సూచించారు.

Follow Our WhatsApp Channel