Posts

Showing posts with the label collector review

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. సమిష్టి కృషికి కలెక్టర్, సీపీ పిలుపు

Image
నిజామాబాద్, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. ...

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం.. కందకుర్తి ఘాట్‌ను కలెక్టర్ పరిశీలన

Image
నిజామాబాద్, వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏమేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్ కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందు...