నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..
మహా పండితులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటకు నిలువు టద్దంగా నిలిచాయి ఓట్ల బేరసారాలు... మొన్నటి వరకు నీతి నిజాయితీ,ప్రజా సేవ,సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని గప్పాలు కొట్టి..పోలింగ్ సమీస్తున్న వేళ బరితెగించారు.. ప్రజా స్వామ్యాన్ని నిలువునా పాతర వేస్తున్నారు..పైసలు పంచితేనే ఓటర్లు కనికరిస్తారని కాబోలు..ఇండిపెండెంట్లు సైతం పచ్చ నోట్ల పందేరానికి తెర తీశారు.ఇండిపెండెంట్లే ఇట్లా బరితెగిస్తుంటే.. ఇక ప్రధాన పార్టీ అభ్యర్థులైతే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రచార పర్వానికి తెరపడిందో లేదో నోట్ల కట్టలతో ఓటర్ల ముంగిట్లో వాలారు గద్దల్లా..ఓటుకు వెయ్యి నుంచి మొదలుకొని రెండు వేల వరకు పంచి పెట్టారు..నిజామాబాద్ నగరంలో అయితే సందేట్లో సడెమియ్య అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటే ఏ మేరకు ఓట్ల కొనుగోలు వ్యవస్తీకృతము అయ్యిందో అర్థము అవుతోంది.. జనరల్ ఎన్నికలను తలదన్నే స్థాయిలో ఓట్ల కోసం బేరసారాలు జరిగాయి. అన్ని పార్టీలు ఒకే తానులో గుడ్డలే అనే సామెత సరిపోయింది.. అన్ని పార్టీలు అక్రమంగా ఓట్లను కొనుగోలు కోసం బరిలో నిల...